రేవంత్ సర్కారుకి హైకోర్టు షాక్…!
మహబూబ్ నగర్ జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. సర్కారు బడుల్లో పిల్లలు చనిపోతే కాని.. స్పందించరా.? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.. అధికారులు ప్రభుత్వం ఎలా పని చేస్తుందో ఇది తెలియజేస్తుంది.
ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది.వారంలో మూడుసార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదంటూ తలంటింది. ఘటనపై వారంలోగా కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున న్యాయవాది హైకోర్టుకు తెలుపగా.. ఆగ్రహం వ్యక్తం చేసింది.
వివరాల సేకరణకు వారం సమయం ఎందుకని నిలదీసింది. హైకోర్టు ఆదేశిస్తేనే అధికారులు పని చేస్తారా? అని నిలదీసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే ఐదు నిమిషాల్లో హాజరవుతారని హైకోర్టు చెప్పింది. అధికారులకు కూడా పిలున్నారని.. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించింది. ఘటనపై భోజన విరామం తర్వాత పూర్తి వివరాలు అందజేస్తామని ఏఏజీ కోర్టుకు తెలిపారు.