తెలంగాణలో ఆరోగ్య ఉత్సవాలు
తెలంగాణ లో ఆరోగ్య ఉత్సవాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . ప్రజాపాలన వేడుకల్లో 213 అంబులెన్స్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు .. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు రాజనర్సింహ, పొన్నం పాల్గొన్నారు ..
ఈ క్రమంలో 108 కోసం 136 అంబులెన్స్‌లు, 102 కోసం 77 అంబులెన్స్‌లు ప్రారంభీంచడం జరిగింది .. 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 24 ఫుడ్ సేఫ్టీ అధికారులకు నియామక పత్రాలు అందజేశారు ..
33 ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లు, 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలు వర్చువల్‌గా సీఎం రేవంత్ ప్రారంభించారు..