హ్యాట్సాప్ 2 చంద్రబాబు

 హ్యాట్సాప్  2 చంద్రబాబు

andhrapradesh cm chandrababu

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీచ్చిన గంటలోనే ఇచ్చిన హామీని నెరవేర్చిండు.. ఇటీవల గుడివాడ పట్టణం రామబ్రహ్మాం పార్కులోని అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఏర్పాటు చేసిన సభలో గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటోడ్రైవర్ రేమల్లి రజనీకాంత్ తో మాట్లాడించారు..

రజనీకాంత్ మాట్లాడుతూ ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలనూ ఉన్నత విద్యను చదివిస్తున్నాను అని తెలిపారు. అతనికొడుకు రవితేజ మాట్లాడుతూ తాను ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తన చెల్లిని బీడీఎస్ చదువుకు చెదోడుగా నిలుస్తున్నానని చెప్పారు.

ఈ క్రమంలో ఆడపిల్ల చదువు కష్టం కాకూడదు. రజనీకాంత్ కు ఎలక్ట్రిక్ తో నడిచే ఆటో సమకూరుస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీచ్చారు. ఈ మేరకు గంటల వ్యవధిలోనే రూ.3.9 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను అందించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *