హ్యాట్సఫ్ సల్మా నేహా..!!

 హ్యాట్సఫ్ సల్మా నేహా..!!

Loading

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసిఆర్ నగర్ లో నాకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇల్లే నాకు స్ఫూర్తి అని నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సల్మా నేహా అన్నారు. నాలుగు ఉద్యోగాలు సంపాదించి ఆ ఆనందం పంచుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారిని సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు.. గతంలో మేము కిరాయి ఇంట్లో ఉండే వాళ్ళం. అందుకు నాకు చదివేందుకు ఆర్థిక పరమైన టెన్షన్ లు, ఇంటి పరిస్థితులు ఇబ్బందులు వచ్చేవి.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు గారు డబుల్ బెడ్ రూం మంజూరు చేయడంలో ఒక స్థిరత్వం వచ్చింది..

పేద కుటుంబం అయిన ఆర్థిక పరంగా ఇల్లు కిరాయి కట్టకుండా కొంత ఉపశమనం వచ్చింది.. దానితో నాకు చదువుకునేందుకు నాలో నాకే ఉత్సాహం వచ్చిందని బాధ్యత పెరిగింది ఏదో సాధించాలనే తపన నాలో కలిగిందని ఇది హరీష్ రావు గారు డబుల్ బెడ్ రూం ఇవ్వడం వలన నేను నాలుగు ఉద్యోగాలు 2024లో గురకులంలో శేరుపల్లి గ్రామంలోని మహాత్మ జ్యోతి రావు పూలె రెసిడెన్షియల్ స్కూల్, రెండవది ఫస్ట్ ర్యాంక్ లాంగ్వేజ్ పండిట్, మూడవది సెకండ్ ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్, దౌల్తాబాద్ మండలం ముబురాస్ పూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం, నాల్గవది జూనియర్ లెక్చరర్ 2025 మార్చ్ 13 లో ఉద్యోగం హన్మకొండ లో సాధించాను అని చెప్పింది. హరీష్ రావు గారే స్ఫూర్తి అన్నారు..

– హ్యాట్సఫ్ సల్మా నేహా..!!

మంచిగా చదివి నలుగురికి ఆదర్శం గా నిలవాలి అన్న మాటను నిజం చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. భర్త మెకానిక్ అని, భర్త కష్టం చూసి కుటుంబ పరిస్థితి చూసి ఒక వైపు కుటుంబ బాధ్యత మరో వైపు ఎదో సాధించాలని తపన తో కష్ట పడి చదివి నాలుగు ఉద్యోగాలు సంపాదించి ఎంతో మందికి ఆదర్శం నిలిచిందని సల్మా నేహా ను హరీష్ రావు గారు మెచ్చుకున్నారు.. నాలుగు ఉద్యోగాలు సాధించి ఎంతో మంది మధ్య తరగతి మహిళలకు యువతి, యువకులకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు, సల్మా నేహా ను అందరు ఆదర్శం గా తీసుకోవాలన్నారు.. ఈ సందర్బంగా ఆమెను శాలువా తో సత్కరించి అభినందించారు…

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *