మంత్రి సీతక్కకు మాజీ మంత్రి హారీష్ మాస్ కౌంటర్..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాస్ కౌంటరిచ్చారు. ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచ్ లకు నిధుల గురించి చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హారీష్ రావు ఒక్క సంతకంతో పంచాయితీలకు బకాయిలున్న నిధులు విడుదలయ్యేవి.
ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు.. మాజీ మంత్రి హారీష్ రావు మొసలి కన్నీళ్ళు కారుస్తున్నారు. దీనికి సమాధానంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” మా ప్రభుత్వ హాయాంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మేము ప్రతి నెల పల్లె ప్రగతి కింద రూ.275 కోట్లను గ్రామ పంచాయితీలకు ఇచ్చాము.
పల్లె ప్రగతి ప్రారంభమైన దగ్గర నుండి మూడు వేల మూడోందల కోట్ల రూపాయలను పల్లెలు గ్రామాల అభివృద్ధికి కేటాయించాము.ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించి ఉంటే నేడు గ్రామపంచాయితీలకు ఈ పరిస్థితి ఉండేది కాదు. గ్రామ పంచాయితీలకు, ఎంపీటీసీలకు సర్పంచులకు కాంగ్రెస్ హస్తం భస్మాసురుడు హస్తంగా మారిందని మాస్ కౌంటరిచ్చారు.