మంత్రి కోమటిరెడ్డికి హారీష్ రావు మాస్ కౌంటర్…!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు సైతం అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యుల మధ్య వార్ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ నల్గోండ మూసీ నది ప్రక్షాళన చేయకపోతే జిల్లాకు చెందిన ప్రజలు ఆగమాగవుతారు. ఇప్పటికే మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు ఆ నది నుండి వచ్చే మురుగు నీరు.. వాసన వల్ల అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. బీఆర్ఎస్ అడ్డుకుంటుంది.
సభలో స్పీకర్ సాక్షిగా మా జిల్లా మంత్రులను.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారిని అభ్యర్థిస్తున్నాను. మూసీ ప్రక్షాళన చేసి నల్గోండ జిల్లా ప్రజలను రక్షించాలని కోరారు. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” మూసీ ప్రక్షాళన చేయడానికి ఎవరూ అడ్డు పడటం లేదు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు నష్టం లేకుండా చేయాలి అని కోరుతున్నాము.
అయిన మూసీ నది అలా కావడానికి రాష్ట్రంలో అత్యధిక కాలం పాలించిన పార్టీ కాంగ్రెస్ కారణం. ఆ పార్టీకి చెందిన నేతలే కారణం .. ఎస్సార్సీపీ స్టేజ్ 2 పనులను పూర్తి చేసి నల్గోండ జిల్లా తుంగతుర్తి నకిరేకల్ నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్లు పారించిన ఘనత బీఆర్ఎస్ ది. ఓ మంత్రి సభలో ఇంకో మంత్రిని ప్రశ్నించే సంస్కృతిని తీసుకురావోద్దు. మంత్రి క్యాబినెట్ లో అన్ని శాఖలపై అధికారం ఉంటుంది. ఈ మాత్రం తెల్వకుండా ఎలా ఉన్నారు అని కౌంటరిచ్చారు.