అసెంబ్లీలో హరీష్ రావు ఉగ్రరూపం..!

Harish Rao Thanneeru
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు లక్షల సర్కారు కొలువులిస్తామని హామీచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది..మరి ఈఏడాదిన్నరలో ఎక్కడ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నిలదీశారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటీ పీసీసీ చీఫ్ రేవంత్ నుంచి ఆ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ దాకా అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న అశోక్ నగర్ చుట్టూ ప్రదక్షిణ చేశారు.నిరుద్యోగ యువతకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలిచ్చి మాట నిలబెట్టుకుంటామని రాహుల్ గాంధీ ఏకంగా ట్వీట్ చేశారు.
ఏం చేశారు. ఊరూరు బస్సు యాత్రలు చేసి రెచ్చగొట్టారు. నిరుద్యోగులను మీ పార్టీ కార్యకర్తలుగా మార్చుకొని మరి ఇల్లిల్లూ తిప్పారు. నాడు నమ్మించారు, నేడు నిండ ముంచారు అని ఆయన ధ్వజమెత్తారు.ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్కలేదని దుష్ప్రచారం చేసారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నిధులు, నీళ్లు, నియామకాలు నెరవేర్చిన ప్రభుత్వం మాది. తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది. ముల్కీ రూల్స్ నుంచి 610 దాకా తెలంగాణ పోరాడింది దేని కోసం? . స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని. మా ఉద్యోగాలు మాకు కావాలని. ఢిల్లీకి తిరిగి తిరిగి దాన్ని సాధించిండు కేసీఆర్.
60-80శాతం మాత్రమే ఉండే స్థానిక రిజర్వేషన్ ను 95శాతానికి పెంచిండు. అందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించిండు. ఇవాళ అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసింది కేసీఆర్. తొమ్మిదిన్నరేండ్ల బిఆర్ఎస్ పాలనలో అక్షరాల 1 లక్షా 62వేల ఉద్యోగాలు భర్తీ చేసినం. ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనే మీ తప్పుడువిషప్రచారం మానుకోండి. అబద్దమే మీ ఆత్మ. అబద్దమే మీ పరమాత్మ. ఇదే కాదు మీ జాబ్ క్యాలెండర్ సంగతి తెలుసు, 57 వేల ఉద్యోగాల ఇచ్చామని చెబుతున్నారు అధ్యక్షా.. అని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.
