భట్టీకి హారీష్ రావు సవాల్..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. గురువారం ఐదో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు వర్సెస్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టీ, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లు అన్నట్లు జరిగింది. ఈరోజు ఉదయం నుండి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మంత్రులను ఎమ్మెల్యేలను ఎవరిని వదిలిపెట్టకుండా అందరికి సబ్జెక్టుతో వివరణలిస్తూ అప్పుడప్పుడు చురకలు అంటిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టీ విక్రమార్క మల్లు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచలేదు.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది అని అన్నారు. దీనికి సమాధానంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులు కేవలం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రమే.
ఈ అప్పులతో కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా ,కళ్యాణ లక్ష్మీ లాంటి పథకాలు అమలు చేశాము.. మీరు ఈఏడాది కాలంలో చేసిన లక్షకోట్ల రూపాయల అప్పులతో ఏమి చేశారు.. డిప్యూటీ సీఎం మేము మెస్ ఛార్జీలు పెంచలేదు అని అన్నారు. మేము పెంచాము.. నేను నిరూపణ చేస్తా. మీరు నిరూపించకపోతే మీ పదవికి రాజీనామా చేస్తారా.. నేను ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ సమర్పిస్తా అని అన్నారు.