రేవంత్ రెడ్డితో హారీష్ రావు భేటీ..!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు.. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ డిప్యూటీ స్పీకర్.. మాజీ మంత్రి తీగుళ్ల పద్మారావు గౌడ్ తో కల్సి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ లో కలిశారు.
ఈసందర్భంగా ఆయన మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి.. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ నియోజకవర్గమైన సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్‌మండిలో పెండింగ్‌లో ఉన్న ఎస్డీఎఫ్ నిధుల కోసం నేను, పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ కలిశాము.
సీతాఫల్‌మండిలో హై స్కూల్, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఒకే చోటా ఏర్పాటు చేసేందుకు బిఆర్ఎస్ హయంలో 32 కోట్లు విడుదల చేశారు. ఎన్నికల కోడ్ రాగానే నిధులు ఆగిపోయాయి. ఎస్డీఎఫ్ నిధులు విడుదల చెయ్యమని అడిగేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు పద్మారావు గౌడ్ నన్ను తీసుకొని వెళ్లారు. ఈ విషయంపై వారికి రిప్రజంటేషన్ ఇవ్వడం జరిగింది అని ఆయన తెలిపారు.