కాంగ్రెస్ ఎంపీకి హారీష్ రావు లీగల్ నోటీసులు

Former Minister Harish Rao
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసనసభ్యులు తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కు లీగల్ నోటీసులు పంపారు.
తనపై ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అసత్య ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ను జతచేస్తూ మాజీ మంత్రి హారీష్ నోటీసులు పంపారు.
హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిదిలో అక్రమంగా నిర్మింఇన ఆనంద కన్వెన్షన్ లో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు వాటాలున్నాయని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించిన సంగతి విదితమే. అందుకే హారీష్ రావు హైడ్రా బాధితుల తరపున వకల్తా పుచ్చుకున్నారు అని ఆయన ట్వీట్ చేశారు.
