రేవంత్ రెడ్డి మాటలన్నీ బోగస్
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలన్నీ బోగస్ అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు.. ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ “తెలంగాణలో అన్ని వర్గాలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. చెప్పేవన్నీ బోగస్ మాటలేనని వి
మర్శించారు. ‘రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు.. నియామకాలు లేవు, నిరుద్యోగ భృతి ఏమైంది. రూ.4 వేల పెన్షన్ రాలేదు. మహిళలకు రూ.2,500 ఏవీ? 40 లక్షల మందికి రుణమాఫీ చేశారనేది బోగస్.
రైతుభరోసా అందలేదు. వరిపంటకు బోనస్ ఇవ్వలేదు. రేవంత్ అబద్ధాల ప్రచారం మహారాష్ట్రలో కూడా కొనసాగిస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.