ఉత్తమ్ కు హరీశ్ రావు కౌంటర్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు వైపల్యానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావులే ప్రధాన కారణం.. వారి తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్ల తెలంగాణకు శాశ్వత నష్టం వాటిల్లింది. ముప్పై వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల పూర్తయ్యేది .
కానీ లక్ష కోట్లతో కాళేశ్వరాన్ని కట్టారు. అది బీఆర్ఎస్ హాయాంలోనే కూలిపోయింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కౌంటరిచ్చారు. మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో మాజీ మంత్రి హారీశ్ రావు కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం మానుకోవాలి అని హితవు పలికారు.
ఫ్రిపేర్ అవ్వకుండా వచ్చే అలవాటు తమకు లేదు. ప్రెజెంటేషన్ లో అన్ని వాస్తవాలు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల వివరాలు ఇంజినీర్లను అడిగి తెలుసుకోవాలని మాజీ మంత్రి హారీష్ సూచించారు. ఇరిగేషన్ మంత్రిగా గోబెల్స్ ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.