అనారోగ్యంతో గురుకుల విద్యార్థిని మృతి

Rave party in Mysore.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మైనారిటీ గురుకుల పాఠశాల 7వ తరగతి చదువుకుంటున్న జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన అంజలి(12) గత నెల 29న పాఠశాలలో వాంతులు చేసుకుంది.పట్టించుకోని గురుకుల సిబ్బంది మాత్రలు మాత్రమే ఇవ్వడంతో మరుసటి రోజు అంజలి నిరసించి వాంతులు ఎక్కువగా చేసుకుంది..
దీంతో గురుకుల సిబ్బంది, తల్లికి సమాచారం ఇవ్వగా తాను వచ్చి అంజలిని ఆస్పత్రికి తీసుకెళ్ళింది.అప్పటికే జ్వరం ఎక్కువ అయి, ఫిట్స్ కూడా రావడంతో నిజామాబాద్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో అంజలి మృతి చెందింది.
తన కూతురు రెండు రోజుల నుండి అనారోగ్యంతో ఉన్నా గురుకుల సిబ్బంది పట్టించుకోలేదని, వాళ్లు ముందే సమాచారం ఇచ్చి ఉంటే తన కూతురు బ్రతికేదని అంజలి తల్లి బోరున విలపించింది.