హారీష్ రావు ను చూసి నేర్చుకోవాలి గురుజీ..!

Guruji, you should learn from Harish Rao..!
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావును అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతో పాటు రాజకీయాల్లోకి రావాలనుకునేవాళ్ళు చూసి నేర్చుకోవాలని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శనివారం రాత్రి సిద్ధిపేట జిల్లాలో వడగండ్లతో కూడిన కురిసిన భారీ వర్షాలకు నారాయణ రావు పేట మండలం, లక్ష్మి దేవిపల్లి గ్రామంలో రైతులు పండించిన పంట నాశనమైంది.
ఇది తెలుసుకున్న మాజీ మంత్రి హారీష్ రావు ఆదివారం స్వయంగా వెళ్లి ఆ పంటను పరిశీలించారు. అంతేకాకుండా నష్టపరిహారం ఇప్పించడంతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీచ్చారు. ఆ తర్వాత కొంతమంది రైతులు మాజీ మంత్రి హారీష్ రావుతో మాట్లాడుతూ తమకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు. మా రుణమాఫీ కోసం ప్రభుత్వంపై పోరాడాలి.
అవసరమైతే అన్ని విధాలుగా అండగా ఉంటామని రైతులు వేడుకున్నారు. అంతే ఈరోజు సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఎనిమిదిరోజు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలంటూ అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది..రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది..
రూ. 2 లక్షల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హజరయ్యారు..దీంతో నెటిజన్లు మాజీ మంత్రి హారీష్ ను చూసి ప్రజాప్రతినిధులు నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఆటోడ్రైవర్లు కోకాపేటలో ఉదయం కలిస్తే సాయంత్రానికి అసెంబ్లీలో వారి సమస్యల పట్ల గళమెత్తిన సంగతి కూడా తెల్సిందే.
