పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త
ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త తెలిపింది..
ఇందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన మొత్తంతో జులై 1న రూ.7,000 పింఛన్ అందజేయనున్నట్లు టీడీపీ తన అధికారక ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
రూ.వెయ్యి పెంచగా అయిన రూ.4000, గత 3 నెలల పెంపు రూ.3000 కలిపి లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి ఇవ్వనున్నట్లు ఎక్స్ లో పేర్కొంది. కొత్త పాసు పుస్తకాలతో పింఛన్ పంపిణీ చేయనున్నట్లు టీడీపీ పేర్కోన్నది.