రుణమాఫీ పై శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. ఈనెల పద్దెనిమిది తారీఖు వరకు లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు .ఈ రోజు సచివాలయంలో జరిగిన కలెక్టర్లతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రుణమాఫీ కి రేషన్ కార్డు తప్పనిసరి కాదు అని తెలిపారు. పాస్ బుక్ ఆధారంగా రెండు లక్షల రుణాలను మాఫీ చేయనున్నామని తెలియజేశారు.ఆయితే ఆ నిధులను పక్కదారికి పోకుండా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు..
ఈ నెల పద్దెనిమిది తారీఖున లక్ష వరకు రుణమాఫీ కానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో రైతులతో కలిసి సంబరాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.