యాసంగికి నీళ్ళు ఇవ్వండి..!

Thanneeru Harish Rao Former Minister Of Telangana
సిద్దిపేట నియోజకవర్గం లో గత నాలుగు సంవత్సరాల నుండి యాసంగి పంటకు నియోజకవర్గ ప్రాంతం లోని రంగనాయక సాగర్ కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సాగు నీటిని అందిస్తున్నామని. ఈ యేట యాసంగి పంటకాలం పూర్తి అయ్యే వరకు సాగు నీటిని అందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి రైతుల పక్షాన లేఖ ద్వారా కోరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు .. నియోజకవర్గం లో గత నాలుగు సంవత్సరాల నుండి యాసంగి పంటకు నియోజకవర్గ ప్రాంతం లోని రంగనాయక సాగర్ కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సాగు నీటిని అందిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.
.దాని వలన రైతులకు మంచి పంట రాబడి పెరిగింది. రంగనాయక సాగర్ కింద ఇలా ప్రతి యేటా గణనీయంగా పంట రాబడి పెరుగుతుందన్నారు.ఈ ఏటా 50వేల ఎకరాల పంట ఉన్నదని లేఖ లో పేర్కొన్నారు.రంగనాయక సాగర్ లో ఇటీవల మీరు 2.4 టి ఎం సిల నీళ్లు పంపింగ్ చేశారని ప్రస్తుతం రంగనాయక సాగర్ లో 1.85 టీ ఎం సి ల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు.. యాసంగి పంటకు పూర్తి స్థాయిలో నీరు అందాలి అంటే ఇంకా 2.5 టి ఎం సి ల నీళ్లు అవసరం ఉన్నాయన్నారు .
కావున మిడ్ మానేరు నుండి రెండు విడుతలుగా రంగనాయక సాగర్ లోకి నీళ్లు పంపింగ్ చేయాలనీ ఇరిగేషన్ అధికారులను ఆదేశించగలరని విజ్ఞప్తి చేశారు.రైతు లు సాగు నీళ్లు లేక తీవ్ర ఆందోళన లో ఉన్నారని గుర్తు చేసారు..గత నాలుగు సంవత్సరాల నుండి యాసంగి కి రైతులకు సాగు నీరు అందించినట్టు గా ఈ యాసంగి పంట కాలం పూర్తి అయ్యేఅంత వరకు రైతుల పంట పొలాలకు సాగు నీరు అందిచాలని సిద్దిపేట నియోజకవర్గ రైతుల పక్షాన తమరికి విజ్ఞప్తి చేయుచున్నట్లు లేఖ ద్వారా కోరారు…
