బీజేపీలో ఫుల్ జోష్.. హస్తంలో నైరాశ్యం..!

 బీజేపీలో ఫుల్ జోష్.. హస్తంలో నైరాశ్యం..!

Full Josh in BJP.. Disappointment in hands..!

Loading

తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీలను ఎగరేసుకుపోయిన బీజేపీ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. అదికారంలో ఉండీ కూడా సిట్టింగ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని దక్కించుకోక పోయినందుకు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. కేవలం డబ్బు ప్రభావంతోనే తాము ఓడిపోయామని బీఎస్సీ భావిస్తోంది. మొత్తానికి పోల్ మేనేజ్మెంట్ బీజేపీ అనుసరించిన విధానాలే తమను గెలిపించాయని బీజేపీతోపాటు ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ విషయంలో కాంగ్రెస్, బీఎస్సీలు విఫలమయ్యాయని ఆయా పార్టీల్లో ప్రచారం మొదలైంది. బరిలో లేకున్నా అధికార కాంగ్రెస్ ఓటమిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ విధానాలు, వైఫల్యాలే వారిని ఓడించాయని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఈ ఫలి తాలు కమలంలో జోష్ ను నింపాయి.బీజేపీ ఈ విషయంలో ఆదినుంచీ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గం, మండలం, డివిజన్, గ్రామాల వారీగా పచ్చాస్ ప్రభా రీలను నియమించి ప్రతీ 25 మందికి ఒక ఇన్చార్జ్ ను నియమియించింది. వారు ప్రతీ ఓటరును రోజూ కలవడం, అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పట్టభద్రులు, నిరుద్యోగులు, టీచర్స్ కోసం తాము చేసిన పోరాటాన్ని వివరిస్తూ ఓటర్లకు చేరువయ్యారు. దీనికితోడు కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పూర్తిస్థాయిలో ప్రచారం చేయడం అభ్యర్ధులకు బాగా కలిసి వచ్చిందని పార్టీ నేతలు అభి ప్రాయపడుతున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *