నాడు మద్యం విషం.. నేడు అమృతం
ఏపీలో గత వైసీపీ హయాంలో మద్యంపై కూటమి నేతలు చేసిన అసత్య ఆరోపణలు నమ్మి మందుబాబులు వారికి ఓట్లు వేశారని ఆ పార్టీ అధికారప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు.
వైసీపీ, తన ఓటమికి వారూ ఓ కారణమన్నారు. అప్పటి మద్యమే నేడు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్నారని తెలిపారు.
నాడు విషమైన మద్యం నేడు అమృతంగా మారిందా? అని ప్రశ్నించారు. లిక్కర్ రేట్లు తగ్గించకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.