మాజీ మంత్రి హారీష్ రావు హౌస్ అరెస్ట్.!
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు.. సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి కోకాపేటలోని ఆయన నివాసానికి భారీగా పోలీసులు వెళ్లారు. హుజురుబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి గోడవలు ఆందోళనలు జరగకుండా ఈ మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.