మంత్రి పొంగులేటికి మాజీ మంత్రి KTR మాస్ కౌంటర్
- Breaking News Slider Telangana Top News Of Today
- singidinews
- August 24, 2024
- 0
- 1 minute read
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు ఐఎన్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “హైదరాబాద్ లోని నా నివాసం బఫర్ జోన్ లో ఉంది..FTL పరిధిలో ఉంది అని మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు లు ఆరోపిస్తున్నారు..
నిజంగా నా నివాసం అలాగే ఉంటే నియమనిబంధనలకు విరుద్ధంగా ఉన్న నా భవనాన్ని తక్షణమే కూల్చేయాలని హైడ్రా కమీషనర్ రంగనాథ్ కు ఆదేశాలను జారీ చేస్తున్నాను.. మాజీ మంత్రి కేటీఆర్ తన ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ ఛానెళ్లను,తన అనుచరబలగాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి నిరూపించవచ్చు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెల్సిందే..
మంత్రి పొంగులేటి విసిరిన సవాల్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి అంత శ్రమ అవసరంలేదు.. ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉంది..FTL పరిధిలోనే ఉంది.. వీటిని నిరూపిస్తూ శాటిలైట్ చిత్రాలున్నాయని ఆయన అన్నారు..
ఆయన ఇంకా మాట్లాడుతూ ఒక్క మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిదే కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే..వీ6 ఛానెల్ అధినేత వివేక్,మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రారావు,మధుయాష్కీ గౌడ్,ఎమ్మెల్సీ పట్నం మాహేందర్ రెడ్డి,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిల నివాసాలు సైతం అక్రమంగా కట్టినవే..
ముందు వీళ్ల అక్రమ కట్టడాలను కూల్చి సామాన్యుల దగ్గరకు వెళ్లాలని సవాల్ విసురుతున్నాను అని మాజీ మంత్రి కేటీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మాస్ కౌంటర్ ఇచ్చారు..