నువ్వు మగాడివైతే చర్చకు సిద్ధమా..?- రేవంత్ రెడ్డికి KTR సవాల్

 నువ్వు మగాడివైతే చర్చకు సిద్ధమా..?- రేవంత్ రెడ్డికి KTR సవాల్

Former Minister KTR challenge to CM Revanth Reddy

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకటే సవాల్ విసురుతున్నాను.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే నిజంగా నమ్మకం ఉంటే ఆయన భాషలోనే చెబుతున్నాను..రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా మగాడివైతే రుణమాఫీ గురించి చర్చకు దా.. !.

ఎలాంటి భద్రత లేకుండా మేము వస్తాము..మీరు కూడా రండి..మీరు చెప్పిన గ్రామానికైన వెళ్దాము..మీరు పుట్టి పెరిగిన ఊరు అని చెప్పుకుంటున్న కొండారెడ్డిపల్లికైన రండి రైతు రుణమాఫీపై చర్చకు కూర్చుందాము..

రైతులే చెబుతారు రుణమాఫీ గురించి తమకు అయిందా..లేదా అని..ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు రేవంత్ రెడ్డి అని సవాల్ విసిరారు..ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనో..సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనో పోలీసులు కేసులు పెడుతున్నారు..ఇందులో పోలీసుల తప్పేమి లేదు..అధికార పార్టీ ఆదేశాలను వాళ్లు అమలు చేస్తున్నారు..

పోలీసులకు ఒకటే విన్నపం చేసుకుంటున్నాను..తప్పు చేస్తే నాపై కూడా కేసులు పెట్టండి కానీ అన్యాయంగా అక్రమంగా కేసులు ఎవరిపై పెట్టకండి..మీపై ఉన్న ఒత్తిడిని నేను ఆర్ధం చేస్కోగలను..కానీ సామాన్యుల బాధను సైతం మీరు ఆర్ధం చేస్కోండి అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *