మరోసారి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

Former Minister Harish Rao who once again showed humanity
ఆధార్ కార్డు లేదని చికిత్సకు నిరాకరించిన ఆడబిడ్డకు అండగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నాయలులు ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు.అసలు విషయానికి వస్తే మహబూబ్ నగర్ జిల్లా మారేడుపల్లికి చెందిన ప్రమీల భర్త సురేష్ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించగా, భర్త మృతి చెందిన నెల రోజులకే కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
తన ఆరేళ్ల కూతురితో హైదరాబాద్ వచ్చిన ప్రమీలకు అనారోగ్యంతో కదలలేని స్థితికి రావడంతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే ఆధార్ కార్డు లేదని వైద్యం చేయడానికి సిబ్బంది నిరాకరించారు.దీంతో ప్రమీల చిన్న పాపతో ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో 10 రోజులుగా అనారోగ్యంతో ఉన్న వార్త ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో తెగ వైరలయింది.

మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన వార్త కథనం చూసి హరీష్ రావు ఉస్మానియా ఆసుపత్రి సూపరిటెండ్ తో మాట్లాడి తక్షణం ఆసుపత్రిలో చేర్చుకావాలని, చికిత్స అందించాలని ఆదేశించారు. మరోవైపు తన కార్యాలయ సిబ్బందికి సమాచారమివ్వడంతో పేషెంట్ వద్దకు చేరుకొని ఆస్పత్రిలో కార్యాలయ సిబ్బంది అడ్మిట్ చేయించారు.

హరీష్ రావు చొరవతో ప్రమీల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఖర్చులకు గాను కొంత ఆర్థిక సహాయాన్ని సైతం హరీష్ రావు గారు అందించారు.మంచి వైద్యం అందించడంతో పాటు, ఆమె కోరిక మేరకు ఇంటికి లేదా అనాధాశ్రమంలో చేర్పించే ఏర్పాటు చేయాలని తన కార్యాలయం ద్వారా ఆసుపత్రి సిబ్బందికి హరీష్ రావు సూచించారు. హారీష్ రావు స్పందనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
