రైతులతో హారీష్ రావు సెల్ఫీ…!

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో రంగనాయక సాగర్ కాలువను పరిశీలించారు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు. కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూస్తూ కాలువ పక్కన రైతులతో మాజీ మంత్రి హారీష్ రావు సెల్ఫీ దిగారు. అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మెట్టుపల్లి గ్రామంలోని పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) తోటలను సందర్శించి, అక్కడి రైతులతో మాట్లాడాను. రైతులు మార్కెటింగ్ సమస్యలను, పంటకు సరైన ధర లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను హారీష్ రావుకు రైతులు వివరించారు.
సన్‌ఫ్లవర్ పంటకు తగిన మద్దతు ధర (MSP) కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు గిట్టుబాటు ధర అందించాలి.రైతుల అవగాహన కోసం పంట వివరాలను ఆన్లైన్‌లో పొందుపరిచి, మార్కెట్ పరిస్థితుల గురించి ముందస్తు సమాచారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని హారీష్ రావు తెలిపారు.
