రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఘాటు రిప్లయ్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాజీ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు,కేటీ రామారావు గురించి నిన్న మంగళవారం పాలమూరు పర్యటనలో మాట్లాడుతూ ” నిరుద్యోగ యువత కాదు కేటీఆర్ హారీష్ రావులు అమరణ నిరాహర దీక్షకు దిగాలి.. వాళ్లు చనిపోవడమా…?. డీఎస్సీ,గ్రూప్ పరీక్షలు వాయిదా వేయడమా ..? అనేది జరగాలి..
కొంతమంది నిరుద్యోగ సన్నాసులు కోచింగ్ సెంటర్ల ట్రాఫ్ లో.. బీఆర్ఎస్ నేతల ట్రాఫ్ లో పడి ధర్నాలు చేస్తున్నారు.. మూడు నెలలు వాయిదా వేస్తే నెలకు కోచింగ్ సెంటర్లకు కోట్ల రూపాయల లాభం వస్తుందని ” ఘాటు విమర్శలు చేసిన సంగతి తెల్సిందే.
తాజాగా తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ “సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను, నిరుద్యోగులను సన్నాసులని అవమానిస్తున్నాడు.రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్లో తిప్పినప్పుడు.. ఆ రోజు రాహుల్ గాంధీ సన్నాసా? రేవంత్ రెడ్డి సన్నాసా? అని వ్యాఖ్యానించారు.