దిలావర్‌పూర్‌లో 122 మంది రైతులపై కేసు
తెలంగాణలోని నిర్మల్ – దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే పంటలు దెబ్బతింటాయని, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని పేర్కొంటూ పరిశ్రమను రద్దు చేయాలని కోరుతూ ఐదు గ్రామాలకు చెందిన ఐదువేల కుటుంబాల రైతులు కుటంబ సభ్యులతో కలిసి ఏడాది కాలంగా పోరాటం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుల డిమాండ్లను అంగీకరించడంతో ఆందోళనలు విరమించారు. రైతులతో ప్రభుత్వం చర్చలు జరుపగా పరిశ్రమను రద్దు చేయడంతోపాటు ఆందోళనకారులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని రైతులు డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం అంగీకరించడంతో ప్రజలు ఆందోళన విరమించారు.
ఇప్పుడు ఆందోళనలో పాల్గొన్న 122 మంది రైతులపై కేసులు నమోదు కావడంతో రైతుల్లో మళ్లీ ఆగ్రహం వ్యక్తమవుతున్నది.హామీలు విస్మరించి కేసులు నమోదుకావడంతో వారు మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.