పాలకుర్తిలో అత్తాకోడళ్ల పోరు..!

గత సార్వత్రిక ఎన్నికల ముందు అత్తా మాటనే ఆకోడలుకి శాసనం. అత్తా ఏది చెబితే తుచా తప్పకుండా పాటించేది. కూర్చోమంటే కూర్చుంటుంది. నిలబడమంటే నిలబడుతుంది. అంతగా అత్త మాట అంటే ఆకోడలకు గౌరవం. మర్యాద. తీరా ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత అత్తా లేదు తొత్తా లేదు. అంతా నేనే.. నా మాటే శాసనం అంటూ ముందుకు దూసుకెళ్తుంది సదరు కోడలు. దీంతో అత్తా తీవ్ర అగ్రహాంతో రగిలిపోతున్నారు.
ఇంతకూ ఈ అత్తా కోడళ్ల పంచాయితీ ఏంటని తెగ ఆలోచిస్తున్నారా..?. తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల సమయంలో అఖరి క్షణంలో తన అత్తా ఝాన్సీ రెడ్డి స్థానంలో పాలకుర్తి అసెంబ్లీ టిక్కెట్ ను దక్కించుకున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే యశస్వీని రెడ్డి. ఎన్నికలకు ముందు వీరిద్దరూ బాగానే ఉన్నారు. ఏడాది వరకూ మంచిగానే ఉన్నారు. గత ఏడు ఎనిమిది నెలలుగా వీరిద్ధరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అత్తా చెప్పిన మాట కోడలు వినడం లేదు. కోడలు చెప్పిన మాట అత్తా వినడం లేదు.
నా గెలుపు కోసం ఎన్నికల్లో పనిచేసిన గ్రామ స్థాయిలో కార్యకర్తల నుండి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకూ పనులు చేసి పెట్టాలి. నామినేటేడ్ పదవుల్లో అవకాశాలు ఇవ్వాలని ఎమ్మెల్యే యశస్వీని రెడ్డి ఆ పార్టీ నాయకత్వాన్ని కోరారు. లేదు నేను చెప్పిన సూచించిన వాళ్లకే పదవులైన.. పనులైన చేసి పెట్టాలని అత్తా ఝాన్సీరెడ్డి అల్టీమేటం జారీ చేశారు.
నేను ఎమ్మెల్యేనా.. అత్తా ఎమ్మెల్యేనా.. ఎవరి మాట ఎవరూ వినాలి అని తన అనుచరుల దగ్గర.. ఆత్మీయుల దగ్గర ఎమ్మెల్యే వాపోతున్నారు. ఇటు అత్తా ఝాన్సీ రెడ్డి మాట వినాల్నా…?. లేదా ఎమ్మెల్యే యశస్వీని రెడ్డి మాట వినాల్నా ..?. ఆర్ధం కాక పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల పరిస్థితి ముందు నోయి. వెనక గోయి అన్నట్లు మారింది. దీంటో పార్టీ పెద్దలు కలగజేసుకుని వీరిద్ధరి మధ్యలో నెలకొన్న వివాదాలను పరిష్కరించాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ విచ్చిన్నం అవుతుందని పాలకుర్తి క్యాడర్ గగ్గోలు పెడుతున్నారు.
