ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ పేరు ప్రస్తావన అవాస్తవం
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తావన వచ్చిందన్న వార్తలు పూర్తిగా అవాస్తవం… ఇలాంటి తప్పుడు వార్తలను బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ కేసులో ఈడీ కేసీఆర్ పేరు ప్రస్తావన చేసిందన్న ప్రచారం తప్పు అని కవిత న్యాయవాది మోహిత్ రావు స్పష్టం చేశారు. ఈడీ వాదనల్లో ఎక్కడ కూడా కేసీఆర్ ప్రస్తావన జరగలేదు అని తేల్చి చెప్పారు.
ఈ విషయంలో తప్పుడు వార్తలను ప్రచారం చేసిన మీడియా సంస్థలు వెంటనే ఆ వార్తలను డిలీట్ చేసి.. క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. లేని పక్షాన.. సదరు మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నామని మీడియా సాక్షిగా తెలిపారు.