మాజీ మంత్రి కేటీఆర్ సంచలన నిర్ణయం..!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాడీ వేడి చర్చ జరుగుతుంది.మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ రేసు విషయంలో ఏసీబి కేసు,అరెస్ట్ చేస్తారనే ఊహాగానాల మధ్య అసెంబ్లీలో ఈ రోజు రైతు భరోసా పై చర్చ మొదలైంది.ఉదయాన్నే సభను ఆలస్యంగా ప్రారంభించడంతో స్పీకర్ కు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సూచన చేసారు..
సభలో రైతుభరోసా పై చర్చ సమయంలో మాజీ మంత్రి కే.టీ.ఆర్ మాట్లాడుతుండగా పదే పదే మంత్రి కొమటిరెడ్డి అడ్డుతగులుతుండటం చర్చ వాదోపవాదాలు,సవాల్,ప్రతీసవాళ్ళతో అసెంబ్లీ లో వేడి రాజుకుంది. మంత్రులు,కేటీఆర్ మద్య మాటల యుద్దం జరిగింది.నల్గొండకు బీఆర్ఎస్ హయాంలో అన్యాయం జరిగిందని మంత్రి కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి అంటే కాలువల వెంట తిరుగుదాం,రైతన్నను అడుగుదాం ఎవరి పాలనలో రికార్డు స్థాయిలో పంట పండిందో తెలుసుకుందామని మంత్రికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే కేటీఆర్ ప్రభుత్వానికి ఒక సంచలన సవాల్ విసిరారు.రుణమాఫీ విషయంలో చర్చ జరుపుతూ రాష్ట్రంలో కొండారెడ్డి పల్లి ఐనా,కొడంగల్ ఐనా,మంత్రి తుమ్మల నియోజకవర్గమైనా రాష్ట్రంలో ఏ గ్రామంలోకైనా వెల్లి రైతులను అడుగుదాం.ఏ గ్రామంలో ఐనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తా అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు..ఒక్కసారిగా కేటీఆర్ విసిరిన ఈ సవాల్ కు ప్రభుత్వం షాక్ అయ్యింది.మరి సవాల్ స్వీకరించి ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్ ని రాజీనామా చేపిస్తుందా వేచి చూడాలి.