మాజీ మంత్రి తలసానికి మాజీ మంత్రి హారీష్ రావు పరామర్శ
తెలంగాణ రాష్ట్రమాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరులు తలసాని శంకర్ యాదవ్ గారు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం మరణించారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు వారి భౌతిక కాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా శంకర్ యాదవ్ గారు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.