రూ.500లు బోనస్ ఇవ్వాల్సిందే

 రూ.500లు బోనస్ ఇవ్వాల్సిందే

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు..ఈ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హారీష్ రావు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం నూతన్ కల్ గ్రామంలో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులను కలిశారు.మాజీ మంత్రి హారీష్ రావు తోపంటకు సరిపడా సాగునీరు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంట విరామం ప్రకటించినట్లు ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.

ఈ సందర్భంగా హారీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని ప్రాంతాల్లో క్రాప్ హాలిడే ప్రకటించడం బాధాకరం. రైతులు అన్ని రకాలుగా నష్టపోయారు. విత్తనాలు పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది.సాగునీరు అందించడంలో విద్యుత్ సరఫరా చేయడంలో ఫెయిల్ అయిపోయింది.

వానకానికి సంబంధించి రైతుబంధు డబ్బులు ఎలాంటి షరతులు లేకుండా కోతులు లేకుండా రైతుల ఖాతాల్లో ఎకరాకు 7500 జమ చేయాలి.రాష్ట్రంలో రైతులు అన్ని రకాలుగా నష్టపోయారు. సాగు నీరు కరెంటు సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.

500 బోనస్ ఇస్తానని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అని మాట మార్చింది ప్రభుత్వం. బోనస్ అని బోగస్ చేసింది.మంత్రులు రోజుకో తీరు మాట్లాడుతున్నారు. వ్యవసాయం మీద అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టుంది.99 శాతం పండే దొడ్డు వడ్లకు బోనస్ ఎగపెడతాం, ఒక శాతం పండే సన్నాలకు బోనస్ ఇస్తామనడం ఎంతవరకు సమంజసం. ఇది పూర్తిగా రైతులను మోసం చేయడమే.

ఆరు నెలల్లో కాంగ్రెస్కు అహంకారం నెత్తికెక్కింది. అహంకారాన్ని దించాల్సిన అవసరం ఉంది.వచ్చే అసెంబ్లీ సమావేశాల వేళ హైదరాబాదుకు తరలివచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని రైతుల హెచ్చరిస్తున్నారు.

చలో అసెంబ్లీ పిలుపునిచ్చి పోరాటం చేస్తామని అంటున్నారు.రైతులకు న్యాయం జరిగేదాకా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాల్సిందే. లేదంటే అసెంబ్లీని స్తంభింప చేస్తాం అని అన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *