మాజీ మంత్రి హారీష్ ఎఫెక్ట్ – కదిలిన మంత్రి తుమ్మల
తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు వెళ్ళే సాగర్ కాలువ కు పడిన గండి గురించి మాట్లాడుతూ ” జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారు.. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావులు న్నారు .. వీరు హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్లాలంటే ఆ కాలువకు వంద మీటర్ల దూరం నుండే పోతారు. ఆ కాలువ గండి దగ్గర ఆగి రివ్యూ నిర్వహించేంత తీరిక వీరికి లేదు..
మంత్రులు తుమ్మల ,పొంగులేటి ఈ ఇరవై రోజుల్లో ఏ ముప్పై సార్లు వెళ్ళి ఉంటారో .. కనీసం ఆ గండి తీర్చే సమయం లేదు.. వీళ్లు మంత్రులు.. ఖమ్మం ప్రజలు కాంగ్రెస్ కు తొమ్మిది స్థానాలను అందించినందుకు వరదల సమయంలో కనీసం వరద బాధితుల కోసం హెలికాప్టర్లు పంపడానికి కూడా మనసు రాలేదు అని ప్రశ్నించారు. అంతే మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మీడియా సమావేశం అనంతరం మంత్రి తుమ్మల ఉన్నఫలంగా ఖమ్మం వెళ్లి ఆ కాలువకు పడిన గండిని సందర్శించారు..
సందర్శించడమే కాదు అధికారులను హుటాహుటిన పిలిపించి మరి అ కాలువకు పడిన గండిని పూడ్చే పనులు చేయించారు.. దీంతో ఖమ్మం జిల్లా ప్రజలు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఎఫెక్ట్ తో కదిలిన మంత్రి తుమ్మల మాకు నీళ్ళు రావడానికి కాలువకు గండి పడిన గండిని పూడ్చివేయించారు.. మాజీ మంత్రి హారీష్ రావు మొన్న వరదలప్పుడు మాకొసం నిత్యవసర వస్తువులను పంపారు.. ఈరోజు మా పొలాలు ఎండుతుంటే సాగర్ నీళ్లు పంపారు అని హార్షం వ్యక్తం చేస్తున్నారు.