రేవంత్ రెడ్డికి ఈటల దమ్మున్న సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి బీజేపీ ఎంపీ.. సీనియర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బహిరంగంగా సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్న భద్రత సిబ్బందిని పక్కన పెట్టాలి..
నేను నా ఎంపీకి ఉన్న భద్రత సిబ్బందిని పక్కన పెడతాను. ఇద్దరం కల్సి భద్రత లేకుండా సామాన్యుల మాదిరిగా మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళ్దాము.. మీరు చేసే ఈ పని మంచిది. శభాష్ రేవంత్ రెడ్డి అని ఏ ఒక్కరూ అన్న కానీ నేను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటాను..
మీకు దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఏ ఒక్కరైన మిమ్మల్ని మీరు చేసే పనిని మెచ్చుకుంటే నేను ముక్కును నేలకు రాస్తాను.. పేదల ఇండ్లను అక్రమంగా తొలగించడం బాధాకరం.. వాళ్లు ఉసురు తప్పకుండా తగులుతుంది అని ఆయన అన్నారు.