హరీష్ రావు లేఖపై విద్యాశాఖ స్పందన
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడు నెలల పాలనలో విద్య వ్యవస్థ అస్తవ్యస్థమైంది. మధ్యాహ్నం భోజనం పథకానికి డబ్బులు చెల్లించడంలేదు.. మధ్యాహ్నం భోజనం వండే వాళ్లకు జీతాలు ఇవ్వడంలేదు.. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెల్సిందే.
ఈ లేఖపై రాష్ట్ర విద్య శాఖ స్పందించింది… మధ్యాహ్నం భోజనం పథకం సంబంధించి వందకోట్ల రూపాయలను విడుదల చేశాము.. త్వరలోనే మరో యాభై మూడు కోట్లను విడుదల చేస్తాము.. పెండింగ్ బకాయిలు ఏమి లేవని రిప్లయ్ ఇచ్చింది…