తెలంగాణలో ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ
తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యులు కేకే ఇటీవల గులాబీ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.. దీంతో తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ రోజు నుండి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు నామినేషన్లను స్వీకరించనున్నది.. ఈ నెల ఇరవై ఏడో తారీఖున బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తుంది. వచ్చే నెల సెప్టెంబర్ మూడో తారీఖున పోలింగ్ జరగనున్నది. ఉదయం 9.00గం.ల నుండి సాయంత్రం 4.00గం. లవరకు పోలింగ్ జరగనున్నది. అదే రోజు సాయంత్రం ఫలితాలను ఈసీ వెల్లడిస్తుంది.
మరోవైపు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్,స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితర ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ పిటిషన్ పై విచారణ జరుగుతుంది.