కాంగ్రెస్ పార్టీ బలోపేతం వద్దు… బీఆర్ఎస్ వలసలే ముద్దు..

mahesh kumar goud
3 total views , 1 views today
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్యలో ఆ పార్టీలో రెండు వర్గాలున్నాయన్నది అధికారకంగా బయటపడ్డది. నిన్న మొన్నటి వరకు స్థబ్బుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒకరి తర్వాత ఒకరూ బయటకోస్తున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన నేతల నియోజకవర్గాల్లో ఆది నుండి కాంగ్రెస్ పార్టీ ను అంటిపెట్టుకుని .. దాదాపు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక కష్టాలను.. అవమానాలను ఎదుర్కున్నారు నేతలు.. కార్యకర్తలు..
తిరిగి తమ పార్టీ అధికారంలో ఉన్న కానీ ఇప్పుడు అదే నేతల చేతిలో అవమానాలు.. కష్టాలను ఎదుర్కోవడం ఏంటని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇదే మాట ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మీడియా ముఖంగా చెప్పడం అధికార పార్టీలో ఉన్న కొంతమంది నేతల.. కార్యకర్తల మనోవేదనకు ఆద్దం పడుతుందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు వలస నేతల వల్ల ఇక్కట్లు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు.
మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకెళ్లి పార్టీ పెద్దలను కల్సి బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఆ పార్టీకి చెందిన నేతలను చేర్చుకోవడమే మార్గం అని చెప్పడం. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ కోటరికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు.. నేతలు కాంగ్రెస్ లోకి చేరుతారని లీకులివ్వడం మాకు పార్టీ శ్రేయస్సు .. కార్యకర్తల. నేతల మనోభావాలు కాదు.. బీఆర్ఎస్ నుండి వలసలే ముఖ్యమనే సందేశాన్ని కాంగ్రెస్ క్యాడర్ కిస్తున్నట్లు తెలుస్తుంది. అధికారం ఉంది కాబట్టి అందరూ మౌనంగా ఉన్నారు కానీ సమయం వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీలో సునామీ పుట్టడం ఖాయమంటున్నారు గాంధీ భవన్ వర్గాలు.
