నాడు వద్దు.. నేడు ముద్దు అంటున్న కాంగ్రెస్ ..!

Don’t want it today.. Congress is asking for a kiss today..!
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దనసరి అనసూయ(సీతక్క), ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు చేసిన ప్రచారం నో టీఆర్ఎస్. నో ఎల్ఆర్ఎస్ .. కాంగ్రెస్ ముద్దు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేస్తామని హామీచ్చారు.
ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎల్ఆర్ఎస్ ధరలను నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నిర్ణయంపై ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలతో పాటు రియల్టర్లు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నాడు ఎల్ఆర్ఎస్ కింద ఎలాంటీ రుసుము అవసరం లేదు అన్నారు. నేడేమో ముద్దు అంటున్నారు. నాడు ఎల్ఆర్ఎస్ తో బీఆర్ఎస్ ప్రజల రక్తాన్ని పీల్చుకుని తాగుతుంది అని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు నేడు అదే ఎల్ఆర్ఎస్ పేరుతో పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నారా అని విమర్శలు విన్పిస్తున్నాయి.
