రేవంత్ ను గద్దె దించేదాక నిద్రపోము
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పిదాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా..?. మహిళలు అని చూడకుండా.. ?. రైతులని ఆలోచించకుండా..?. రాత్రా పగలా అని సంబంధం లేకుండా లాఠీ చార్జ్ లు చేస్తారా..?. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ లీడర్ తన్నీరు హారీష్ రావు ప్రశ్నించారు. నిన్న గురువారం మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ లో చర్లపల్లి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో లగచర్లలో పార్మాసిటీ వద్దని రైతులు.. ఆ గ్రామ ప్రజలు గత ఆరు నెలలుగా ధర్నాలు రాస్తోరోకులు చేస్తున్నారు.
కలెక్టర్, అధికారులు భూసేకరణకు వెళ్తే తమ మనోభావాలకు అభిప్రాయాలను విలువ ఇవ్వకుండా పరిగణలోకి తీసుకోకుండా ఎలా భూసేకరణ చేస్తారని ఎదురుతిరిగారు. దానికి మాజీ ఎమ్మెల్యే పట్నం కు ఏమి సంబంధం.?. గెలిచిన ప్రజాప్రతినిదే పట్టించుకోకపోతే అక్కడి ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పుకోవడం తప్పా..?. బీఆర్ఎస్ నేతలకు.. కార్యకర్తలకు భూములు ఉండకూడదా..?. వాళ్ల భూములను అక్రమంగా తీసుకుంటే మౌనంగా ఉండలా..? . మీ మాజీ ఎమ్మెల్యేనే అరెస్ట్ చేశాము.
మీరేంత అని ప్రజలను. బీఆర్ఎస్ క్యాడర్ ను పరోక్షంగా బెదిస్తున్నారా,.?. మీరు ఎన్ని కుట్రలు చేసిన.. ఎన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ప్రజలకు అండగా ఉంటుంది. బీఆర్ఎస్ క్యాడర్ కు మద్ధతుగా ఉంటుంది. ఇప్పటికైన డైవర్షన్ పాలిటిక్స్ ను పక్కకు పెట్టి ప్రజల అటెన్షన్ పాలిటిక్స్ చేయాలి.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.. హమీలను నెరవేర్చేదాక వదిలిపెట్టము.. రేవంత్ సర్కారును గద్దె దించేదాక నిద్రపోము అని ఆయన అన్నారు.