తెలంగాణ కాంగ్రెస్ లో కలవరం- కారణం ఇదే..!

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రేగుతుందా..? పరిపాలన అస్తవ్యస్తంగా మారిందా ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు పట్ల మంత్రివర్గమంతా గుర్రుగా ఉన్నారా..?..సీఎం రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు వికటిస్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తుంది.. అందుకు తాజాగా జరిపిన కులగణన విషయంలో కాంగ్రెస్ యూటర్న్ నే ఉదాహరణగా చెప్పవచ్చు..
ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటినుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రులు తమ సన్నిహితుల వద్ద చర్చించుకున్నట్టు తెలుస్తుంది.. మొదట్లోనే రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష నేత హరీష్ రావు రెచ్చగొడితే రెచ్చిపోయి అనవసరంగా నిర్ణయాన్ని తీసుకుని, మిగతా పథకాల అమలులో జాప్యానికి కారకులైనారని చర్చించుకున్నట్టు తెలుస్తుంది..
మంత్రివర్గంలో చర్చించకుండా సొంతంగా కొన్ని నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి అవి అమలు సరిగా జరగక చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారట..ముఖ్యమంత్రి తీరు నచ్చని కొందరు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు ఇటీవల సంచలన చర్చ జరిగింది.. ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులది మరో మాట..
ముఖ్యమంత్రికి కొందరు మంత్రులకు పొసగడం లేదని తెలుస్తుంది.. పథకాన్ని ప్రకటించడం, దాన్ని అమలు చేయకుండా వాయిదా వేయడం, వరుస వాయిదాలు కాంగ్రెస్ క్యాడర్ను ప్రజల్లో చులకన అయ్యేలా చేస్తున్నాయని, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తిరగలేని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తుంది.. గ్రామాల్లో తిరగలేని పరిస్థితి నెలకొందని, పథకాల అమలు వేగం చేయాలని మంత్రుల వద్ద ఎమ్మెల్యేలు తమ గోడు వెల్లబోసుకున్నట్టు తెలుస్తుంది..
ఎంతో సంతోషంగా అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర గందరగోళం లో ఉన్నట్టు తెలుస్తుంది.. ఈ కల్లోలానికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అధిష్టానం ఏ దిశగా అడుగులు వేస్తుందో మీరు చూడాల్సింది..
