ఖమ్మం వరదబాధితులకు దొరకని హెలికాప్టర్ కేరళకెళ్లిందా…?
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో ఖమ్మం (ఉమ్మడి )జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా సైతం అతలాకుతలమైన సంగతి తెల్సిందే. ఏకంగా మున్నేరు వాగు బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది ఉన్న ఓ కుటుంబాన్ని రక్షించడానికి హెలికాప్టర్ లేదు.. పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాము అని జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో ఓ ప్రకటన కూడా చేశారు.
ఆ హెలికాప్టర్ రాకపోవడంతో జేసీబీ డ్రైవర్ సుభాన్ తన ప్రాణాలకు తెగించి మరి అదే జేసీబీ తో ఆ తొమ్మిది మందిని రక్షించడం వైరల్ అయింది. కేరళలో వాయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ సీనియర్ మహిళ నేత ప్రియాంకా గాంధీ నామినేషన్ ఈరోజు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ,కేసీ వేణుగోపాల్, మల్లిఖార్జున ఖర్గే లకు ఓ హెలికాప్టర్ లో హాజరయ్యారు ..
దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఖమ్మం వరద బాధితుల కోసం దొరకని హెలికాప్టర్ వీరికోసం దొరికిందా అని ఆ హెలికాప్టర్ వీడియోను పోస్ట్ చేస్తూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అయితే ఈ హెలికాప్టర్ తెలంగాణకు చెందిందా…?. లేదా అనేది సంబంధితాధికారులు క్లారిటీవ్వాల్సి ఉంది.