రిటైర్మెంట్ పై ధోనీ క్లారిటీ..!

MS Dhone
టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ స్టార్ ఆటగాడైన ఎంఎస్ ధోనీ ప్రతీ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు క్రికెట్ నుండి పూర్తిగా వైదొలుగుతారు. రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఇక అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్తారు అంటూ ఓ వార్త నిత్యం వైరలవుతూ ఉంటది.
తాజాగా అలాంటి వార్తలపై ఎంఎస్ ధోనీ క్లారిటీచ్చారు. ఆయన తాజాగా స్పందిస్తూ తాను చిన్నతనంలో క్రికెట్ ను ఎలా అయితే ఎంజాయ్ చేశానో అదే తరహాలో ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నాను.
బహుశా ఇంకొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడతానేమో. ఆడినంత కాలం ఆస్వాదిస్తాను’ అని తేల్చి చెప్పారు. దీంతో ధోనీ మరికొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడతారన్న భరోసా వచ్చిందంటూ ఆయన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
