తెగించిన తెలుగు తమ్ముళ్లు- వైసీపీ మాజీ ఎమ్మెల్యే స్లిప్పర్ షాట్ రిప్లయ్..!

Desperate Telugu brothers – Former YSRCP MLA’s slipper shot reply..!
ఏపీ అధికార టీడీపీకి చెందిన నేతలు.. కార్యకర్తలు కొంత మంది ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కూతురు వరస అయ్యే బంధువు సుమయ రెడ్డి అనే అమ్మాయితో సంబంధాలు అంటగడుతూ తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై సదరు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇచ్చిన రిప్లయ్ తెలుగు తమ్ముళ్లకు స్లిప్పర్ షాట్ అంటూ వైసీపీ సానుభూతి పరులు.. కార్యకర్తలు.. నెటిజన్లు ఆ రిప్లయ్ ను షేర్ చేస్తూ కూతురిలాంటి ఓ అమ్మాయితో ప్రకాష్ రెడ్డికి ఎలా అక్రమ సంబంధం అంటకడతారు. ఇదేనా మీనాయకుడు చెప్పిన పాఠం అని ప్రశ్నిస్తున్నారు. మీరు ఓ లుక్ వేయండి ఆ రిప్లయ్ పై.
నమస్తే..!
నేను మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రేపటి రోజున రామగిరి మండలానికి శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీకి దురాగతాలపై గొంతు ఎత్తడానికి స్వచ్ఛందంగా వేలాదిగా ప్రజలు తరలివచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండడం జగన్మోహన్ రెడ్డి గారిని రామగిరి మండలం లోనికి రానివ్వకుండా అడ్డుకునే పరిస్థితి కనపడకపోవడంతో నా సమీప బంధువులు నా కుటుంబ సభ్యులు అందర్నీ కూడా నీచపు రాజకీయ క్రీడలో కి లాగుతున్నారు.
ఒక వీడియో నేను ఒక ఎయిర్పోర్టులో మా బంధువుల అమ్మాయితో నేను మాట్లాడుతుండగా వీడియో వైరల్ చేసి నీచానికి పాల్పడుతున్నారు. ఎవరైతే ఆ వీడియోని అప్లోడ్ చేస్తారో పోస్ట్లు పెట్టడం జరుగుతుందో ఎవరైతే వైరల్ చేయడం జరుగుతుందో వారందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తూ లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది.
దాదాపుగా 25 సంవత్సరాల నా రాజకీయ జీవితం లో నేను సంపాదించుకున్న గౌరవ మర్యాదలు ఈ పద్ధతిలో నష్టపరుస్తామనే మీరు ఆలోచన చేస్తే దీన్ని మీ దుర్మార్గమైనటువంటి విష ప్రచారాన్ని నమ్మే పరిస్థితిల్లో ఎవరు లేరు మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నా నిజాయితీ కలిగిన నాయకత్వంతో రాప్తాడు నియోజకవర్గం లో పేదలకు సేవలు అందిస్తున్న నాపై బురద చల్లేటువంటి కార్యక్రమాల వల్ల మీకు ఎటువంటి ఫలితం ఉండదు దానివల్ల మీరు గొప్పవారు కాలేరని తెలుసుకోవాలని కోరుతున్నాం అంటూ బంధువు వరసైన ఆ అమ్మాయిని చిన్నతనం నుండి ఎలా చూస్కోన్నారో కొన్ని ఫోటోలను జతపరిచి రిప్లయ్ ఇచ్చారు.
ఇట్లు
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే-రాప్తాడు
