ఢిల్లీలో బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ నడుస్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నలబై ఒక్క స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. ఆప్ పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లో అధిక్యంలో ఉంది.
ఉదయం నుండి కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రౌండ్ రౌండ్ కు మారుతున్న ఫలితాల ట్రెండ్ మారుతూ వస్తుంది.. ఏడు రౌండ్ల తర్వాత మాజీ సీఎం కేజ్రీవాల్ మళ్లీ వెనకంజలో ఉన్నారు.. జంగ్ పూరాలో 2,345 ఓట్ల ఆధిక్యంలో మనీష్ సిసోడియా ఉన్నారు..
10 సీట్లలో రెండు పార్టీల మధ్య స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉంది.. కేవలం వందల ఓట్ల తేడాతోనే అభ్యర్థుల ముందంజలో కొనసాగుతున్నారు.. 14 సీట్లలో రెండు పార్టీల మధ్య 3 వేల ఓట్ల తేడా ఉన్నట్లు తెలుస్తుంది..
