సీఎం ఇలాఖాలో ఆరాచకం..!

 సీఎం ఇలాఖాలో ఆరాచకం..!

Loading

ఆమె ఓ స్కూల్లో స్వీపర్..స్వీపర్ పని చేసినందుకు  నెలకి  జీతం 3 వేల రూపాయలు మాత్రమే.అది కూడా మూడు నెలలకో.తొమ్మిది నెలలకో ఒకసారి ఇస్తారు..ఈసారి దేవుడు కరుణించాడనుకుంటా ఆమెకు 3 నెలల జీతం ఒకేసారి నిర్ణయించాడు. దీనికి సంబంధించిన రూ 9 వేల చెక్కు మీద సంతకం చేయకుండా నెల రోజులు తిప్పుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డి.. ఇదేం అన్యాయమని అడిగినందుకు పోలీసులతో  కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి కొట్టించాడు..ఈ సంఘటన

కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం అల్లీపూర్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది..ఈ పాఠశాలలో భీమమ్మ అనే వృద్ధురాలు పదేండ్లుగా స్వీపర్ గా పనిచేస్తున్నది..భీమమ్మకు మూడు నెలలుగా జీతం ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారు.. నాలుగు నెలల క్రితం భీమమ్మ కోడలు చనిపోయింది

దీంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నామని, నెలకు రూ.3000 జీతాన్ని కూడా ఇవ్వకుండా ఆపితే తాము ఎలా బ్రతకాలని భీమమ్మ కొడుకు ఎల్లయ్య పాఠశాల హెచ్ఎంకు ఫిర్యాదు చేశాడు..

పాఠశాల హెచ్ఎం స్పందించి జీతం చెక్ రాసి, సంతకం చేయమని పాఠశాల చైర్ పర్సన్ వెంకటమ్మకు పంపగా ఆమె కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి చెప్పాడని తిరస్కరించింది..దీంతో ఎల్లయ్య తన తల్లికి ఇవ్వాల్సిన జీతం ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారని పాఠశాల చైర్ పర్సన్ వెంకటమ్మ, కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డిని అడిగాడు..

మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ రమేష్ రెడ్డి ఎస్ఐ విజయ్ కుమార్ కు పిర్యాదు చేశాడు.దీంతో విజయ్ కుమార్ నిజానిజాలు తెలుసుకోకుండా ఎల్లయ్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచక్షణారహితంగా కొట్టాడు..తాను ఏ తప్పూ చేయకపోయినా ఎస్ఐ విజయ్ కుమార్ విచక్షణారహితంగా కొట్టాడని.. ఎస్ఐ విజయ్ కుమార్ పై, కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఏడుస్తూ తన ఆవేదన తెలిపాడు

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *