తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుకు మండలి ఆమోదం..!

Damodar Raja Narasimha Health and Medical Cabinet Minister of Telangana
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై స్పష్టమైన ప్రకటన చేశారు. తెలంగాణ వైతాళికులు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును తెలుగు యూనివర్సిటీ కి నామకరణం చేయడం జరిగిందన్నారు. పొట్టి శ్రీరాములు గొప్ప గాంధీయవాది అని కొనియాడారు. హైదరాబాద్ లోని చర్లపల్లి లో ఉన్న అతిపెద్ద రైలు టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
బాల్కంపేటలో ఉన్న ఆయుర్వేద ఆసుపత్రికి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొణిజేటి రోశయ్య గారి పేరును నామకరణం చేయటం తో పాటు వారి విగ్రహాన్ని ఏర్పాటు, వారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర శాసనసభ శాసనమండలి ఆమోదం తెలిపాయి. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారు మంచి వక్తా అని ప్రశంసించారు. వారు 16 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత వారికుందన్నారు. మా అందరికీ స్ఫూర్తి ప్రదాత రోశయ్య గారిని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… త్యాగమూర్తులను మనం స్ఫూర్తిగా తీసుకుందామని పిలుపునిచ్చారు. ఏ కులానికి, వర్గానికి నష్టం జరగకుండా స్ఫూర్తి ప్రదాతల పైన గౌరవం అలాగే ఉంటుందన్నారు. పొట్టి శ్రీరాములు గారు గొప్ప గాందేయవాది అని కొనియాడారు. వారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరణ నిరాహార దీక్ష చేసిన గొప్ప నాయకుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి పేరుతో తెలుగు యూనివర్సిటీకి నామకరణం చేయడం జరిగిందన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాష విస్తరణకు కృషి చేసిన వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును తెలుగు యూనివర్సిటీ కీ నామకరణం చేయాలని ప్రవేశపెట్టిన బిల్లు కు శాసనమండలి శాసనసభ ఆమోదం తెలిపింది. 1930లో మొట్టమొదటి తెలుగు మహాసభ అప్పటి మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిందన్నారు.
