కాంగ్రెస్ తల్లిని గాంధీభవన్ కు పంపిస్తాం..!
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో గండిమైసమ్మ సమీపంలో నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం మరియు పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు..
మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హంతకులే సంతాప సభలు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి పైన కూడా కుట్రలు చేస్తుంది.తెలంగాణ తల్లి ఔనత్యాన్ని, గౌరవాన్ని తగ్గించేలా పేదరాలి లెక్క రాష్ట్రాన్ని దివాలా తీసిన తీరుగా రూపొందించిన ఈ దివాళకోరు పాలకులు తమ భావ దారిత్యాన్ని చూపించారు.తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎవరూ లేరు… కానీ తెలంగాణ తల్లిని మార్చిన దరిద్రులు తెలంగాణలో ఉన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి.తెలంగాణ తల్లి రూపాన్ని మార్చమని ఈ ప్రభుత్వాన్ని ఎవరు అడిగారు? ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజల తలరాతలు మారాలి కానీ తల్లులు మారుతారా?.ప్రభుత్వాలు మారినప్పుడు భరతమాత గానీ, తెలుగు తల్లి గానీ మారిందా?. అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ప్రజల బతుకులు నాశనం చేస్తున్నారు, దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ బతుకమ్మను కూడా నాశనం చేసారు. తెలంగాణ తల్లి అంటే ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ, ఒక పార్టీ కోసం సంబంధించినది కాదు; మొత్తం తెలంగాణ సమాజాన్ని జాగ్రత్తపరిచిన గొప్ప స్ఫూర్తి.
ఇప్పటికే తెలంగాణలో బతుకమ్మ చీరలను మాయం చేసిన ప్రభుత్వం, తెలంగాణ పథకాలను మాయం చేసిన ప్రభుత్వం, మొత్తం తెలంగాణనే మాయం చేయాలని కుట్ర చేస్తుంది.అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయం.కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సచివాలయం ముందు ఉన్న రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని గాంధీభవన్ కి పంపిస్తాం.ఇదే విధంగా ఈరోజు కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ పేరుతో మోసం చేస్తున్నారో, ఆ కాంగ్రెస్ తల్లిని గాంధీభవన్ పంపిస్తాం.కాంగ్రెస్ తల్లి భస్మాసుర హస్తం చూపిస్తూ అభయహస్తం అంటూ మోసం చేస్తుంది.అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తోంది ఇదే కాంగ్రెస్ తల్లి.
తెలంగాణ ప్రజలు మోసపడేటట్లు చేసిన కాంగ్రెస్ తల్లిని కచ్చితంగా గాంధీభవన్ కి పంపిస్తాం.రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పంపించడం ఖాయం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలిఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన మేడ్చల్ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ గారికి మరియు పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా రేపు భారత రాష్ట్ర సమితి పలు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడుతుంది.తెలంగాణ తల్లి పేరు చెప్పి ఈరోజు కాంగ్రెస్ తల్లి పేరుతో ఈ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా రేపు తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలతో పాటు పంచామృత అభిషేకాలు చేయాలి.
కాంగ్రెస్ పార్టీ మూర్ఖులు చేసిన అపచారానికి, “కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ చరిత్ర తెలీదు” అని తెలంగాణ తల్లిని వేడుకుందాం, క్షమించమని అడుగుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడు, భారత రాష్ట్ర సమితి కార్యకర్త ప్రతి ఒక్కరు తమ వాట్సాప్ మరియు ఇతర సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ తల్లి చిత్రాన్ని ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోవాలి.