“హైడ్రా” కు రూ.25లక్షలు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదారాబాద్ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములు… అక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించాలనే లక్ష్యంతో ఏర్పడిన వ్యవస్థ “హైడ్రా”.. హైడ్రాకు కమీషనర్ గా ఐపీఎస్ ఏవీ రంగనాథ్ ను ప్రభుత్వం నియమించింది.
గత కొన్ని రోజుల్లోనే 45ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకుంది.. కొన్ని వందల అక్రమ కట్టడాలు.. నిర్మాణాలను కూల్చివేసింది.. దీంతో హైడ్రా పనితీరును మెచ్చి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ విరాళం ప్రకటించారు.
ఎంపీ ల్యాడ్స్ నిధుల నుండి 25లక్షలను హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ కు వారి కార్యాలయంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ” హైదరాబాద్ లో చెరువులను ,ప్రభుత్వ భూములను కాపాడటంలో హైడ్రా పనితీరు భేష్. అంకితభావం నిజాయితీ ఉన్న ఐపీఎస్ అధికారైన ఏవీ రంగనాథ్ ను కమీషనర్ గా నియమించడం శుభపరిణామం అని ఆయన అన్నారు.