మంత్రి పదవి రాకపోతే బీఆర్ఎస్ లోకేళ్తానంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే..!

Congress MLA says he will join BRS if he doesn’t get ministerial post..!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు నిన్న సోమవారం అత్యవసరంగా హస్తీనాకు బయలు దేరి వెళ్లిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణు గోపాల్, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే లతో వీరు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈ ఉగాది పండుగక్కి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అంతేకాకుండా నామినేటేడ్ పోస్టుల భర్తీకి కూడా అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అందులో తనకు కానీ తన సోదరుడికి కానీ అవకాశం ఉండదని గుర్తించిన ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఇటీవల మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో అసెంబ్లీ బీఆర్ఎస్ ఎల్పీలో భేటీ అయ్యారు.
ఈసందర్భంగా త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం ఉండదు. అందుకే తనతో పాటు ఓ పది మంది ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్ నుండి చేరిన ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పినట్లు అసెంబ్లీ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. చూడాలి మరి ఈ వార్తలు నిజమో కాదో మున్ముందు తెలుస్తుంది.
