మాజీ మంత్రి కేటీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ..!

 మాజీ మంత్రి కేటీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ..!

Congress MLA meets former minister KTR..!

Loading

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఓ వినూత్న సంఘటన చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ స్థానిక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కల్సి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారని అసెంబ్లీ వర్గాల్లో గుసగుసలు.

దాదాపు పదినిమిషాల పాటు కేటీఆర్ తో సదరు ఎమ్మెల్యే మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ ను కల్సిన సంగతి తెల్సిందే. తాజాగా అదే పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే వివేక్ కేటీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *