రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు..!

టీమిండియా కెప్టెన్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి డా. షామా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి.. తన అధికారక సోషల్ మీడియా అకౌంటులో డా. షామా “రోహిత్ శర్మ యావరేజ్ ప్లేయర్. అత్యంత ఆకట్టుకోని కెప్టెన్.. ‘రోహిత్ ఫ్యాట్ గా ఉన్నాడు.
బరువు తగ్గాలి. ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడు. లెజండ్రీ ఆటగాళ్లైన గంగూలీ, సచిన్, కోహ్లితో పోలిస్తే అతనో సాధారణ ప్లేయర్’ అని షామా పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై హిట్ మ్యాన్ ఫ్యాన్స్, బీజేపీనేతలు మండిపడుతున్నారు.
మరోవైపు బీజేపీ నేతలు స్పందిస్తూ ‘రాహుల్ నాయకత్వంలో పని చేసే మీకు కెప్టెన్సీ గురించి ఎలా తెలుస్తుందిలే.. అయిన ఓ అంతర్జాతీయ టోర్నమెంట్ లో ఆడుతున్న సమయంలో ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహారించడం కాంగ్రెస్ నేతలకే చెల్లింది. వాళ్లకు దేశభక్తి ఎక్కడుంది’ అంటూ బీజేపీ నేతలు ఫైరవుతున్నారు.
